కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొచ్చి విమానాశ్రయంలో వరద నీరు చేరింది. విమానాశ్రయం ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరడమేకాక రన్ వే పైన కూడా నీరు ప్రవహిస్తుండడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేత కొనసాగుతుందని తెలిపారు. కొచ్చి నుంచి బయలుదేరే విమానాల్లో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకునేందుకు, ప్రయాణ తేదీల్లో మార్పులు చేసుకునే విషయంపై ఎలాంటి స్పష్టత అధికారులు ఇవ్వకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని కొచ్చితో పాటు వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కొజిక్కోడ్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ విపత్తు నిర్వహణ విభాగ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని కోరారు.
కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాల పై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు