ఆర్టీసీ జేఏసీ ఈరోజు తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నాయి. నిరసన వ్యక్తం చేసిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుల బంద్ కు మద్దతుగా నిలిచిన జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.కూకట్ పల్లి ఆర్టీసీ డిపో దగ్గర శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తెలంగాణ జనసేన ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. తమ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు.
ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యత: చంద్రబాబు