telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం…

Corona

దేశంలో మరో సారి కరోనా పంజా విసురుతోంది. ముంబయితో పాటు మహారాష్ట్రలోని ఇతర జిల్లాలతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వాసులకు సత్ససంబంధాలు అధికంగా ఉన్నాయి. వారి రాకపోకలతో కరోనా వైరస్‌ ముప్పు పొంచి ఉండడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఇరు జిల్లాలకు చెందిన యంత్రాంగం అప్రమత్తం అవుతోంది. జిల్లాలోని అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేయడంతో పాటు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని కనీస జాగ్రత్తలు పాటించాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా లో ముందస్తు జాగ్రత్తలను ఏర్పాటు చేయిస్తున్నారు జిల్లా కలెక్టర్. మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి వచ్చే ప్రతి ఒక వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ థర్మల్ పరీక్షలను చేస్తూ కోవిడ్ 19 ప్రాథమిక లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు ఇక్కడి వైద్యులు. అలాగే తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న తెలంగాణ వాసులలో కరోనా ప్రాథమిక లక్షణాలు కనబడితే వారికి 14 రోజుల పాటు హోమ్ క్వరెంటైన్ విధించి వైద్య సేవలను అందిస్తామని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

Related posts