ఆస్ట్రేలియాతో తలపడుతున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు అలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ స్మిత్ డబుల్ సెంచరీతో 497/8 వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే తొలి దెబ్బ తాకింది.
పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ వార్నర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్ 4 ఓవర్లకు గానూ 10 పరుగులు సాధించింది. ఈ రోజుతో సహా మరో రోజు ఆట మిగిలుండడంతో మ్యాచ్ ఫలితం తేలడం కష్టమే. పైగా వరణుడు కూడా మ్యాచ్‌కు సహకరించడం లేదు.
సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నాకు తెలియదు… బాలయ్య సంచలన వ్యాఖ్యలు