telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

గ్రీన్ టీ తాగుతున్నారా.. అయితే మీ పని మాటాష్ !

మ‌న‌ అంద‌రికీ గ్రీన్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలిసిందే. గ్రీన్ టీ తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ క‌రుగుతుంది. అయితే  ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల నస్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  గ్రీన్ టీ లో టానిన్ లు ఉంటాయి. ఇవి కడుపులోని ఆమ్లంతో కలిసి కడుపు నొప్పిని కలిగిస్తాయి. కడుపులో అధిక ఆమ్లం కొందరిలో వికారాన్ని కలిగిస్తాయి. దీని వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. గ్రీన్ టీ సహజంగా ఇనుమును గ్రహించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీ లోని కెఫెన్.. ఆండ్రినల్ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. ఇది కర్టీసాల్, ఆండ్రినలిన్ లాంటి ఒత్తిడి హార్మోన్లను రిలీస్ చేస్తుంది. దీని కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. గ్రీన్ టీ.. సహజమైన మూత్ర విసర్జనకు భంగం కలిగించడమే గాక, నిర్జలీకరణానికి దారి తీస్తుంది. నిర్జలీకరణం కారణంగా తలనొప్పి, బద్దకం మరియు అలసట లాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్రీన్ టీ తాగేటపుడు ఖాళీ కడుపుతో కాకుండా.. ఏదయినా స్నాక్స్ తింటూ తాగడం ఉత్తమం. అలాగే గ్రీన్ టీని అధికంగా తీసుకుంటే మ‌న శ‌రీరంలో హార్మోన్ల ప‌నితీరులో స‌మ‌తుల్య‌త దెబ్బ తింటుంది. హార్మోన్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అంతే కాదు గ్రీన్ టీని అధికంగా తాగితే నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తుంది. క‌నుక గ్రీన్ టీని నిత్యం 2 లేదా 3 క‌ప్పుల‌కు మించ‌కుండా తాగాలి.

Related posts