telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర సహకారం చాలా తక్కువగా ఉంది: కేటీఆర్‌

KTR TRS Telangana

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సహకారం చాలా తక్కువగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముంబయిలో నిర్వహించిన నాస్కామ్‌ టెక్నాలజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఫోరమ్‌ 28వ సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మోడల్‌ అభివృద్ధి దేశంలోని మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మేకిన్‌ ఇండియా అంటున్న కేంద్రం.. రాష్ట్రాలకు సహకరించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబందు పథకాన్ని ఇతర రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. రైతుబంధుతో తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చామని ఆయన తెలిపారు. ఇంటింటికి రక్షిత మంచి నీరు అందిస్తున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమను జిల్లా కేంద్రాలకు విస్తరించామని చెప్పారు. టెక్‌ మహీంద్ర లాంటి ప్రముఖ కంపెనీలు వరంగల్‌లో తమ శాఖలను ఏర్పాటు చేశారని తెలిపారు.

Related posts