telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అమెరికా వైట్ హౌస్ లో కరోనా ఆంక్షల ఎత్తివేత…

white house usa

కరోనా ఫస్ట్ వేవ్ లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశం అమెరికా. రోజుకు లక్షల్లో కేసులు వేళల్లో అరుణాలి సంభవించాయి. దాంతో అక్కడ కతోనా నియమాలు తీసుకోవడంతో ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దేశంలోని ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్‌ను వేగ‌వంతంగా అందిస్తున్నారు. దీంతో అమెరికాలో కేసులు త‌గ్గుముఖంప‌ట్టాయి. ఇక ఇదిలా ఉంటే, వైట్‌హౌస్‌లో చాలా కాలం త‌రువాత అధికారులు మాస్క్ లు లేకుండా తిరుగుతూ క‌నిపించారు. అటు అధ్య‌క్షుడు జో బైడెన్‌, ఉపాద్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్‌తో స‌హా అంద‌రూ మాస్క్ ల‌ను పక్క‌న పెట్టి క‌ర‌చాల‌నం, ఆలింగ‌నం చేసుకుంటూ ఉత్సాహంగా క‌నిపించారు. ఆర‌డుగుల దూరం ప‌క్క‌న‌పెట్టి మునుప‌టి మాదిరిగా ఒక‌రికోక‌రు ద‌గ్గ‌ర‌గా ఉంటూ మాట్లాడుకుంటున్నారు. అటు జ‌ర్న‌లిస్టుల విష‌యంలో ప‌రిమితిని ఎత్తివేశారు. దీంతో వైట్‌హౌస్ ఇప్పుడు సంద‌డిగా మారింది.

Related posts