ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరభ్ గంగూలీ భాజపాలో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి అమిత్‌షాను ఈ నెల 12న ఆయన కలిసినప్పటి నుంచి ప్రసార మాధ్యమాల్లో ఈ మేరకు ఊహాగానాలు మొదలయ్యాయి. 2021లో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున సీఎం అభ్యర్థిగా ఆయన్ని నిలపడానికే ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష పదవిని ఇచ్చారనేది వాటి సారాంశం.
గంగూలీ మాత్రం ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. ప్రస్తుతానికి అలాంటి రాజకీయ పరిణామాలేవీ లేవని కోల్‌కతాలో విలేకరులకు చెప్పారు. అమిత్ షాతో తన భేటీలో అలాంటి చర్చ ఏదీ రాలేదని స్పష్టం చేశారు.
చంద్రబాబును మార్షల్స్ అడ్డుకోవడం దారుణం: నక్కా ఆనంద్ బాబు