telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

క్యాంపుల్లో మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులు!

muncipal elections telangana

తెలంగాణలో  9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన తమ అభ్యర్థులను శిబిరాల్లో ఉంచాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. 25వ తేదీ సాయంత్రానికి నగరపాలక, మున్సిపల్‌ ఫలితాలు వెల్లడవుతాయి.

అభ్యర్థులను రెండ్రోజుల పాటు క్యాంపుల్లో ఉంచాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం ఇచ్చారు. ఈ నెల 27న మేయర్, చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. ఈ క్రమంలో, గెలిచిన అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల వలలో పడకుండా ఉండేందుకే టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు నిశ్చయించినట్టు తెలుస్తోంది.

Related posts