దేశంలో ఇప్పటికీ పరిష్కృతం కాని అంశాల్లో ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఒకటని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణపై జగన్ ప్రభుత్వం తన వైఖరి తెలపాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నాలు చేస్తోందంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు.ఎస్సీ వర్గీకరణ అంశం చాలా తీవ్రమైనదని హెచ్చరించారు.
కేంద్రంలోని ఎస్సీ ఎంపీలందరూ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని హర్షకుమార్ చెప్పుకొచ్చారు.ఎస్సీ వర్గీకరణ విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ముందడగు వేయాలని స్పష్టం చేశారు. ఇటీవలే ఎమ్మార్పీస్ ప్రకాశం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హాజరై మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో హర్షకుమార్ వ్యాఖ్యలు చర్చనీయశంగా మారాయి.