అధికారంలో ఉన్న రాజకీయనాయకులు నైతిక విలువలను పక్కనబెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం ఈ రోజుల్లో ఆనావాయితీగా మారింది. చాలామంది రాజకీయ నేతలు పదవులు వచ్చాక తాము ప్రజాసేవకులం అనే విషయన్ని మర్చిపోతుంటారు. అధికార దర్పంతో హద్దుమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. యూపీలోని షాజహాన్ పూర్ లో నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూపీ మంత్రి లక్ష్మి నారాయణ్ హాజరయ్యారు.
అయితే వేదిక దగ్గరకు వస్తుండగా ఆయన వేసుకున్న షూ లేస్ ఒకటి ఊడిపోయింది. వెంటనే పక్కన ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ముందుకు వచ్చి ఆయన షూ లేస్ కట్టాడు. అయితే దీన్ని అడ్డుకొని మంత్రి నారాయణ్ ఆనందంతో నిలబడ్డారు.ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలామంది నెటిజన్లు మంత్రిపై దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వ ఉద్యోగి చేత షూ లేసులు కట్టించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి నారాయణ్ స్పందిస్తూ షూ లేస్ కట్టి నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నానని తెలిపారు.
దళితులపై దాడులను జగన్ ఎందుకు ఖండించడం లేదు?: చంద్రబాబు