telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్రతి రోజూ టమాటా జ్యూస్‌ తాగితే డాక్టర్‌తో అవసరమే ఉండదు !

టమాటాలను జ్యూస్‌ రూపంలో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా తరచూ డీ హైడ్రేషన్‌ సమస్యలతో బాధపడే వారు.. రెగ్యూలర్‌గా ఒక గ్లాస్‌ చొప్పున టామాటా జ్యూస్‌ తీసుకుంటే మంచిది. ఎందుకంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే గుణాలు ఈ జ్యూస్‌లో పుష్కలంగా ఉంటాయి. అలాగే టమాటా జ్యూస్‌లో ఫైబర్‌, వాటర్‌ ఎక్కువ. కొవ్వు, కెలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గవచ్చును. బరువు తగ్గాలనుకునేవారు రోజుకో గ్లాస్‌ టమాటా జ్యూస్‌ తీసుకుంటే వేగంగా బరువు తగ్గొచ్చు. టమాటా జ్యూస్‌ తీసుకోవడం వల్ల అందులో ఉండే పొటాషియం, విటమిన్‌ సి, కోలిన్‌ వంటి పోషకాలు రక్తంలో ఉండే బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను కరిగించేస్తాయి. అలాగే రక్తం గడ్డకట్టకుండా తోడ్పడుతుంది. దీంతో గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి. అలాగే కంటి చూపు లోపిస్తున్న వారు ప్రతిరోజూ ఈ జ్యూస్‌ తీసుకుంటే చాలా మంచింది. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధిని కూడా ధరికి చేరకుండా ఈ జ్యూస్‌ సహయపడుతుంది. అంతేకాదు మొటిమలు, ముడతలు, పొడిబారడం వంటి సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. చర్మాన్ని ఎల్లప్పుడు యవ్వనంగా ఉంచుతుంది టమాటా జ్యూస్‌.

Related posts