telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రతి విద్యార్థికీ మూడు జతల డ్రెస్సులు: సీఎం జగన్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఏపీ సర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా విద్యా రంగంపై నిపుణుల కమిటీతో జగన్ భేటీ అయ్యారు. విద్యా రంగంలో మార్పులపై కమిటీకి తన అభిప్రాయాలను జగన్ తెలిపారు. ఏ స్థాయిలోనూ డ్రాపౌట్స్ ఉండకూడదని సీఎం జగన్ అన్నారు. ప్రతి విద్యార్థికీ మూడు జతల డ్రెస్సులు, షూలు, సాక్సులు ఇస్తామని చెప్పారు. పట్టణాల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే బాధ్యతను ‘అక్షయపాత్ర’కు అప్పగిస్తామని చెప్పారు.

గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు అప్పగిస్తామని అన్నారు. పాఠశాల, కళాశాల ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ప్రతి విద్యార్థికీ ఏటా రూ.20 వేలు అందజేస్తామని తెలిపారు. డిగ్రీ అనంతరం ఉద్యోగం వచ్చే విధంగా యువతకు శిక్షణ ఇస్తామని చెప్పారు.

Related posts