telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కింగ్ నాగార్జునతో జబర్దస్త్ యాంకర్ రొమాన్స్

హాట్ యాంకర్ రష్మీ జబర్దస్త్‌, ఢీ ఛాంపియన్స్, అనుభవించు రాజా’ లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా బుల్లితెర పై హవా కొనసాగిస్తూనే, మరోవైపు వెండితెరపై ఆచితూచి అడుగులేస్తోంది. రష్మీ ఇప్పటికే ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’, గుంటూర్ టాకీస్ లాంటి మూవీస్ చేసింది. ఇప్పటి వరకు పెద్ద హిట్ కొట్టలేదు రష్మి. ఈ నేపథ్యంలో  తాజాగా ఆమె నాగార్జున సినిమాలో ఒక అవకాశాన్ని దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ‘గోవా’లో మొదటి షెడ్యూల్ షూటింగు జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రష్మీని తీసుకున్నారట. గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ ‘గుంటూరు టాకీస్’ చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని చెప్పుకుంటున్నారు.  

Related posts