telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సల్మాన్ ఇంటివద్ద భద్రత కట్టుదిట్టం… బిగ్ బాస్ ఎఫెక్ట్

Salman-Khan

హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో వివాదాస్పదంగా మారింది. బిగ్‌బాస్ చెప్పినట్లుగా ఇందులో పాల్గొనే అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే మంచం షేర్ చేసుకోవాలని బిగ్‌బాస్ రూల్ పెట్టింది. ఈ రూల్ వల్ల వారు ఒకరిపై చేతులు, కాళ్లు వేసుకుని మరీ పడుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి షోల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, పైగా సమాజంపై చెడు ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు. భారతసంస్కృతికి వ్యతిరేకంగా అభ్యంతరకరంగా బిగ్‌బాస్ సీజన్ 13 నడుస్తోందని, షోపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్, బిగ్ బాస్ షో హోస్ట్ సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. శుక్రవారం కర్ణిసేన కార్యకర్తలు ముంబైలోని సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెడ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్‌తో వస్తోన్న బిగ్ బాస్ సీజన్ 13ను నిషేధించాలని కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సీజన్ 13కు తీసుకుంటోన్న ఇతివృత్తం భారత సంస్కృతిని మంటగలిపేలా ఉందని, కర్ణిసేన వర్గంతోపాటు మరికొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Related posts