telugu navyamedia
సినిమా వార్తలు

నా రాజీనామా వెనక లోతైన అర్థం ఉంది..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జ‌రిగాయి. నటులు.. రాజకీయ నాయకుల మాదిరిగా మారిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. చివరికి ‘మా’ ఎన్నికలు ముగిశాయి…ఎన్నికల రిజల్ట్ వచ్చినా కూడా స‌భ్యుల్లో  ‘మా’ వేడి తగ్గడం లేదు.

ఈ ఎన్నికల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి విష్ణుతో పోటీపడి ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోయారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు అక్టోబర్​ 11న ప్రకటించారు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయని, నేను తెలుగువాడిని కాన‌ని, అందుకే ఓడించార‌ని ఆవేద‌న చెందారు.

An upset Prakash Raj resigns from Maa Association | 123telugu.com

ఆ వెంటనే ‘అధ్యక్షుడిగా నేను ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాని అంగీకరించను’ అని, ప్ర‌కాశ్‌రాజ్‌తో క‌లిసి ముందుకు సాగాలని తాను కోరుకుంటున్న‌ట్టు విష్ణు స్పష్టం చేశారు.

దీంతో రీసెంట్‌గా .. తన ట్విట్టర్లో తన రాజీనామాపై స్పందించారు. .’మా’ సభ్యత్వానికి తాను రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉందని, అదేంటో త్వరలోనే తెలియజేస్తానని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. ” మాకు (ప్యానెల్‌) మద్దతుగా నిలిచిన ‘మా’ సభ్యులకు నమస్కారం. నేను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉంది. మిమ్మల్ని మేం నిరాశ పరచం. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా” అని పేర్కొన్నారు.

Related posts