telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ కన్నడ దర్శకుడు నగేష్ బాబు కన్నుమూత

Nagesh Babu

కన్నడ దర్శకుడు నగేష్ బాబు అక్టోబర్ 6న కన్నుమూశారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. రెండురోజుల క్రిత్రం ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దాంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. నాగేష్ బాబుకు భార్య శ్యామల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 24 క్రాఫ్ట్ లలో మంచి పట్టున్న డైరెక్టర్ గా గుర్తింపు సాధించిన నగేష్ బాబు మృతి కన్నడ చిత్ర సీమను షాక్ కు గురిచేసింది. మాండ్యా జిల్లాలో జన్మించిన నగేష్ బాబు ప్రేమదా పుత్రి (1957) చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. హిట్ కన్నడ చిత్రాలైన తూగుదీపా, నాన్నా కర్తవ్య చిత్రాలకు డైలాగ్ రైటర్ గా కూడా పని చేశారు. ఆ తరువాత నగేష్ బాబు బెంగళూరులోని గాంధీ నగర్ప్ర లో ప్రగతి స్టూడియోస్ పేరుతో స్టూడియోను ప్రారంభించారు. అక్కడ తన సోదరుడు అశ్వత్ నారాయణంతో కలిసి ఫోటోగ్రాఫర్లకు స్టిల్ ఫోటోగ్రఫీని నేర్పించాడు. ఆ తరువాత కొన్ని చిత్రాలను నిర్మించారు. 2009 లో నగేష్ బాబు ఇంగ్లీషులో “తత్వామసి-యు ఆర్ దట్” పేరుతో 87 నిమిషాల డాక్యుమెంటరీని రూపొందించారు. ఇది అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితం అయింది.

Related posts