పొడుగు కాళ్ళ సుందరి కత్రినా కైఫ్ కు యూత్ లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఎంత అందంగా ఉంటుందో… అంతే రేంజ్ లో స్టెప్పులేస్తే స్టేజ్ షేక్ అవ్వాల్సిందే. ఎన్నో అద్భుతమైన సాంగ్స్‌కి అదిరిపోయే స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపుతుంది కత్రినా. అయితే తాజాగా ఈ అమ్మడు తన స్నేహితుడి వివాహంలో ‘అఫ్ఘన్ జిలేబీ..’ పాటకు చిందులేసింది. లేత నీలి రంగు డ్రెస్సులో కత్రినా వేస్తున్న స్టెప్పులు చేసి అక్కడి వారు మురిసిపోయారు. ప్రస్తుతం కత్రినా డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ అమ్మడు ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సూర్యవంశీ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
previous post
next post
వివాహ వ్యవస్థపై సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు