telugu navyamedia
సినిమా వార్తలు

“ఇండియన్-2” ఫస్ట్ లుక్ 

Indian-2 First Look
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన “భారతీయుడు” సినిమా అప్పట్లో సంచలన హిట్ సాధించింది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా “ఇండియన్-2” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శంకర్. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన “ఇండియన్-2” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా తండ్రి సేనాపతి కానుకలో కమల్ మర్మకళను ప్రదర్శిస్తున్న పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈనెల 18 నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Related posts