telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“క్వీన్”కు జయలలిత మేనల్లుడి హెచ్చరిక

Queen

న‌టిగా, రాజ‌కీయ నాయ‌కురాలిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు జ‌య‌లలిత‌. టాప్ హీరోయిన్‌ జ‌య‌లలిత తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌ భాష‌ల‌లో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది. 1960 మ‌ధ్య కాలంలో టాప్ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించింది అందాల న‌టి జ‌య‌లలిత.భార‌త రాజ‌కీయాల‌లోను ముఖ్య పాత్ర పోషించిన జ‌య‌ల‌లిత దాదాపు 14 సంవత్స‌రాల‌కి పైగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించింది. త‌మిళ తంబీలు అమ్మ‌గా పిలుచుకొనే జ‌య‌ల‌లిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆమె బ‌యోపిక్ ను రూపొందించేందుకు ప‌లువురు ద‌ర్శ‌కనిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేతి రెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి “శశి లలిత” పేరిట బ‌యోపిక్ చేస్తున్నాడు. అలానే తమిళ దర్శకురాలు ప్రియదర్శిని “ది ఐరన్ లేడీ” పేరుతో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ రూపొందిస్తుంది. ఇందులో జయలలితగా నటి నిత్యామీనన్‌ నటించనుంది. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్‌ విజ‌య్ “త‌లైవీ” అనే టైటిల్‌తో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తుండ‌గా, ఇందులో కంగనా ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ జ‌య‌ల‌లిత జీవితంపై కల్పిత వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీనికి “క్వీన్” అని పేరు పెట్టారు. MX ప్లేయర్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో రమ్య కృష్ణన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ వెబ్ సిరీస్‌ని మ‌నం వీక్షించ‌వ‌చ్చు. ఇటీవ‌ల చిత్ర ప్రీ లుక్ కూడా విడుద‌ల చేశాడు. ఈ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ఆప‌క‌పోతే కోర్టులో కేసు వేస్తాన‌ని హెచ్చ‌రిస్తున్నారు జ‌య‌ల‌లిత మేన‌ల్లుడు దీపక్. జ‌య‌ల‌లిత గురించి ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌మీనన్ కి ఏం తెలుస‌ని బ‌యోపిక్ రూపొందిస్తున్నాడు. త‌క్ష‌ణమే వెబ్ సిరీస్‌ని ఆపాల్సిందిగా హెచ్చ‌రిస్తున్నాను అంటూ ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రి దీనిపై గౌత‌మ్ మీన‌న్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.

Related posts