telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పండగకు .. ప్రత్యేక రైళ్లు.. ఎన్ని పెట్టినా కుక్కక తప్పనిస్థితిలో రైల్వే శాఖ..

trains heavy passangers

సంక్రాంతి కి ప్రయాణీకుల రద్దీని తొలగించడానికి, రైల్వే అధికారులు వివిధ గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఆ ట్రైన్ల వివరాలు : రైలు నెంబర్ 07184 విజయవాడ-విజయనగరం జనసధరన్ స్పెషల్ జనవరి 11,12,13 తేదీల్లో సర్వీసులు అందించనుంది. రాత్రి 9.10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది. తిరిగి వచ్చే దిశలో, రైలు నెంబర్ 07185 విజయనగరం-విజయవాడ జనసధరన్ స్పెషల్ జనవరి 12,13 న తేదీల్లో సర్వీసులు అందిచనుంది. ఉదయం 7.45 గంటలకు విజయనగరం నుండి బయలుదేరి ఉదయం 9.23 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఉదయం 9.25 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07187 విజయనగరం-విజయవాడ జనసధరన్ స్పెషల్ జనవరి 17,18,19 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు విజయనగరం నుండి బయలుదేరి రాత్రి 11.30 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. రాత్రి 11.32 గంటలకు దువ్వాడ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి వచ్చే దిశలో, రైలు నెంబర్ 07186 విజయవాడ-విజయనగరం జనసధరన్ స్పెషల్ జనవరి 18, 19 తేదీల్లో సర్వీసులు అందించనుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి.. సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. 6.32 గంటలకు దువ్వాడ నుంచి పున:ప్రారంభమై… రాత్రి 8.15 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది. 12 జనరల్ క్లాస్ కోచ్‌లు కలిగిన ఈ ట్రైన్ నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపుడి, అనపర్తి, సమర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సిపట్నం రోడ్, ఎలమంచలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్త వలస స్టాపుల్లో ఆగుతుంది.

రైలు నెంబర్ 07197 విజయనగరం-రాజమండ్రి జనసధరన్ స్పెషల్.. జనవరి 14 న ఉదయం 7.45 గంటలకు విజయనగరం నుండి బయలుదేరి ఉదయం 9.23 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఉదయం 9.25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రికి చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07198 రాజమండ్రి-విజయనగరం జనసధరన్ స్పెషల్ జనవరి 17 సర్వీసును అందించనుంది. మధ్యాహ్నం 2.50 గంటలకు రాజమండ్రి నుండి బయలుదేరి.. సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. దువ్వాడ నుండి సాయంత్రం 6.32 గంటలకు పున: ప్రారంభమై రాత్రి 8.15 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది. 12 జనరల్ క్లాస్ కోచ్‌లు కల్గిన ఈ రైలు ఈ రైలులో ద్వారపుడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సిపట్నం రోడ్, ఎలిమంచలి, అనకాపల్లి, దువ్వాడ, విజయవాడ విజయనగరం స్టాపుల్లో ఆగుతంది.

రైలు నెంబర్ 08523 విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు జనవరి 12 & 19 (ఆదివారాలు) సర్వీసును అందించనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి..మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి వచ్చే దిశలో, 08524 సికింద్రాబాద్- విశాఖపట్నం ప్రత్యేక రైలు జనవరి 13, 20 (సోమవారం) సర్వీసును అందించనుంది. సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలుకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్ స్టేషన్స్‌లో స్టాప్స్ ఉన్నాయి.

రైలు నెంబర్ 08525 విశాఖపట్నం-విజయవాడ డబుల్ డెక్కర్ ప్రత్యేక రైలు జనవరి 12 & 19 (ఆదివారాలు) తేదీల్లో సర్వీసులు అందించనుంది. ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి ఉదయం 11.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి వచ్చే దిశలో, 08526 నెంబర్ గల విజయవాడ-విశాఖపట్నం డబుల్ డెక్కర్ ప్రత్యేక రైలు 12 & 19 (ఆదివారాలు) సర్వీసును అందించనుంది. విజయవాడ నుండి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఎనిమిది డబుల్ డెక్కర్ కోచ్‌లు గలు ఈ రైలుకు దువ్వాడ, అనకపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్స్‌లో స్టాప్స్ ఉన్నాయి.

Related posts