telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నగరంలో మరోసారి వరుణుడి విశ్వరూపం….

బంగాళఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడన ద్రోణులతో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ను మరోసారి తన విశ్వరూపం చూపించాడు. దాంతో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. మోకాల్లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీనగర్‌ దగ్గర జాతీయ రహదారి డివైడర్‌ పైనుంచి వరదనీరు పొంగిపొర్లడంతో.. రెండు కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయాయి. ఇటు మెహదీపట్నం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రహదారిపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇక మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు. నగర శివారులోని హిమాయత్ సాగర్ జలాశయానికి వరద వస్తోందని.. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువన మూసీ నదిలోకి విడుదల చేస్తున్నామని తెలిపారు. కొన్ని చోట్ల చెట్లు కూలడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అలాగే రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.  

Related posts