telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మోసగాళ్లు సినిమాలో విష్ణు సోదరి పాత్రకు మొదట..?

Mosagallu

మంచు విష్ణు తన కెరీర్‌లో ఢీ సినిమా తరువాత అంతటి హిట్ మళ్లీ అందుకోలేదు. అందుకే ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని మోసగాళ్లు సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అతడి సోదరి పాత్రలో నటించారు. అయితే ఇటీవల విష్ణు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో మొదటగా తన సోదరి పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాను కలిశారంట. అయితే ఈ సినిమా కథ విన్నాక ఆమె తిరస్కరించారు. అమెరికాకు సంబంధించిన స్కామ్ అనగానే ఆమె నన్ను ఆపే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ సినిమా తీస్తే తనను కొడతారని, తన కుటుంబం అమెరికాలోనే ఉంటున్నారని అన్నారు. ఆ తరువాత వెంటనే విష్ణు కాజల్‌కు ఫోన్ చేశారంట. నిజమైన కథ కాబట్టి బాగుంటుందని కాజల్ ఓకే చేశారంట. ఇదిలా ఉంటే ఈ సినిమా తన మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జెట్‌తో చేస్తున్నాని, సినిమా పక్కా అంతటి విషయం సాధిస్తుందని విష్ణు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది… అనేది.

Related posts