telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం అయింది. ఈ ఎన్నికకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ సమయం ఉండగా.,. సాగర్ ఉపఎన్నికలను ప్రశాంత నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ఉండగా… వాటిలో 108 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు అధికారులు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకునేలా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసే వరకు డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ లాంటి అంశాలపై తనిఖీలు చేయగా సాగర్ లో 2లక్షల 2వేల 300 మంది ఓటర్ లు ఉన్నారు. అందులో పురుషులు..1,09,228 ఉండగా మహిళలు…1,11,072 మంది ఉన్నారు. ఇక 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5535 మంది పోలింగ్ సిబ్బంది, 4 వేల మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కోవిడ్ గైడ్ లెన్స్ ప్రకారం ఉప ఎన్నిక జరుగుతుంది. ప్రతి ఒక్కరు మాస్కు పెట్టుకొని ఓటు వేయడానికి రావాలి. ప్రతి పోలింగ్ సెంటర్ దగ్గర థర్మల్ స్కానర్ లు,గ్లావ్స్, సానిటీజర్ లు ఏర్పాటు చేశారు.

Related posts