ఆంధ్రప్రదేశ్‌లోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఈరోజు బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీ అధిష్ఠానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి అరకులోయ ఎంపీగా గెలుపొందిన గీత ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు. అంతేకాకుండా గత ఏడాది తాను స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
ఐటీ దాడులపై ఎందుకు మాట్లాడటం లేదు: మంత్రి బొత్స