telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ-బట్లర్ గొడవ పై స్పందించిన మోర్గాన్…

భారత్-ఇంగ్లాడ్ మధ్య జరిగిన చివరి టీ20 లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది భారత్. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భారత్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో మంచి షాట్లు ఆడుతూ మలాన్‌-బట్లర్ జోడి రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని కట్టడి చేసేందుకు భువనేశ్వర్‌ కుమార్‌ను రంగంలోకి దింపిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. అప్పుడే పెవిలియన్‌కి వెళ్తున్న బట్లర్ వెనక్కి వచ్చి మరీ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ కలగజేసుకుని ఇద్దరికి సర్దిచెప్పాడు. విరాట్ కోహ్లీ-జోస్ బట్లర్ మధ్య గొడవపై సోమవారం ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు. ‘కోహ్లీ-బట్లర్ మధ్య ఏం జరిగిందో నాకు స్పష్టంగా తెలియదు. కానీ కోహ్లీ మ్యాచ్‌ ఆడేటప్పుడు చాలా ఎమోషనల్‌గా కనిపిస్తాడు. అతను కెప్టెన్ కూడా కావడంతో మ్యాచులో అతనికి పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. అయిన మ్యాచ్‌ల్లో ఇలాంటి వాగ్వాదాలు సహజమే. అందుకు ఇదే ఓ చిన్న ఉదాహరణ’ అని మోర్గాన్ పేర్కొన్నాడు. అయితే ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Related posts