ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో రెవెన్యూశాఖపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలోవాణిజ్యపన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల నివేదికలపై జగన్ ఆరా తీశారు. రెవెన్యూ శాఖలో లంచాలు వ్యవస్థ ఉంటే సహించేది లేదని స్పష్టం చేశారు. మద్య నియంత్రణ అమలుకు తగు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు.
నాటుసారా తయారీ కాకుండా చూడాలని ఆదేశించారు. మద్యం వల్ల వచ్చే అనర్థాలపై పాఠ్య ప్రణాళికలో ఉంచాలని తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మద్య నిషేధం అమలుకోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులను వినియోగించాలని సూచించారు. మద్యపాన నిషేధంపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఎన్ ఫోర్స్ మెంట్, పోలీస్ విభాగాలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉద్యోగం కావాలంటే పరాయి రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా?: చంద్రబాబు