telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్ తమ పార్టీని కేసీఆర్ కి అమ్మేసింది…

dk aruna bjp

దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేత డీకే అరుణ తన మాజీ పార్టీ కాంగ్రెస్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది, ఆ పార్టీకి అభ్యర్థి లేడని అన్నారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్న ఆమె ప్రధాని మోడీ ముందు రాహుల్ సరిపోతాడా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని కెసిఆర్ కి అమ్మేసిందని ఆమె అన్నారు. బిజెపి అభ్యర్థిని ఓడించాలని శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారన్న ఆమె ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, అందుకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. కాంగ్రెస్ కి ఓటేస్తే మోరీలో వేసినట్లేనని దుబ్బాకలో కచ్చితంగా బీజేపీ గెలుస్తుందని అన్నారు.

ఆ తర్వాత కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరు అని బీజేపీ నేత వివేక్ అన్నారు. తెలంగాణ వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు వచ్చాయి అని తెలిపారు. నిరుద్యోగ భృతి ఏమైంది.. నిరుద్యోగ భృతిపై హరీశ్ కేసీఆర్ ను ప్రశ్నించాలి అని తెలిపారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెంచారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఆ కాళేశ్వరం డబ్బులతో దుబ్బాకలో ఓట్లను కొనాలనుకుంటున్నారు అని పేర్కొన్నారు. అయితే ఎన్నికలహామీలపై హరీశ్ కేసీఆర్ ను ప్రశ్నించాలి అన్నారు.  కరోనాపై తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆ కరోనా టైంలో సెక్రటేరియట్ ను కూల్చివేశారు. సెక్రటేరియట్ లో ఐసోలేషన్ సెంటర్ పెడ్తే బాగుండేది అని వివేక్ అన్నారు.  ఇప్పుడు హరీశ్ రావు ప్రశ్నించాల్సింది బీజేపీని కాదు సీఎం ను అని వివేక్ చెప్పుకొచ్చారు.

Related posts