telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీరో బడ్జెట్ పాలిటిక్స్‌ చేస్తామని పవన్ అన్నారు: మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

JD Laxminarayana filed nomination janasena

జనసేన పార్టీలో చేరడానికి గల కారణాలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వివరించారు. మీరొస్తే బాగుంటుందని పవన్‌ కల్యాణే నన్ను జనసేనలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా నేను జనసేన పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే..జీరో బడ్జెట్ పాలిటిక్స్‌ చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారని తెలిపారు. నేను ఆలోచిస్తోన్న విధి విధానాలు ఉన్నాయి. పార్లమెంటరీ నియోజక వర్గంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి.

గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సింబల్‌ వంటివి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం పడుతుంది. 16, 17 రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నాను. రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు 2,80,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఓడిపోయామని మేము ఎన్నడూ అనుకోలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా గెలుస్తామని భావించాం’ అని తెలిపారు.

‘పొలీట్ బ్యూరోలో నన్ను ఉండాలన్నారు. ఐదుగురితో పొలిట్ బ్యూరో ఉండడం సరికాదని, ఆ సంఖ్య ఎక్కువ ఉండాలని చెప్పాను. ఆలోచనలు అనేవి అందులో జరగాలని అన్నాను. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుటుందన్నాను. ఆ తర్వాత ఏమైందో తెలీదు. ఆ పొలిట్ బ్యూరోలో నేను లేను. నేను పార్టీలో చేరిన తర్వాత పెద్దగా సమయంలేదు. ఎన్నికలు వచ్చాయి. సమావేశాల్లో పాల్గొన్నాను. నాకు ఇవ్వాల్సిన సలహాలు నేనిచ్చాను’ అని చెప్పారు.

Related posts