విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాశారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించవద్దని, కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం జగన్.. తనతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఒకసారి ప్రధాని మోడీకి లేఖ రాసిన జగన్.. ఇప్పుడు నేరుగా ప్రధానిని కలిసేందుకు అనుమతి కోరుతూ జగన్ మరో లేఖ రాశారు. కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహరంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేరు లేదని.. స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం రాష్ట్రానికి పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మెరుగైన ఉత్పాదకత కోసమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని.. ప్రైవేటీకరణ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెరుగుతుందని విశాఖ ఎంపీ సత్యనారాయణ నిన్న అడిగిన ప్రశ్నకు నిర్మలాసీతారామన్ సమాధానం ఇచ్చారు.
previous post