telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత ఆటగాళ్లకు ఆ లీగ్స్ లో ఆడాలని ఉంటుంది : మోర్గాన్

ఇంగ్లండ్‌లో నిర్వహించే ‘ది హండ్రెడ్‌’ బాల్‌ క్రికెట్‌ లీగ్‌ లో ఆడాలని భారత ఆటగాళ్లకు ఉంటుందని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. ‘టీమిండియా క్రికెటర్లకు కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా, అక్కడి సంప్రదాయాలు తెలుసుకోవాలన్నా చాలా ఇష్టం. వారికి ది హండ్రెడ్‌ లీగ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఇతర లీగుల్లోనూ పాల్గొనాలని ఉంది. వారు ఆడితే ఆయా లీగ్‌లకు క్రేజ్ వస్తుంది. కానీ లీగ్‌లతో కొన్ని దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్‌ లీగ్‌ల కారణంగా కొన్ని దేశాలు అత్యుత్తమ తుది జట్లను బరిలోకి దింపలేకపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. ఆటలో ఏమాత్రం కొత్త మార్పులు రావట్లేదు. మనం ముందుకెళ్లేకొద్దీ కొత్తగా ప్రయత్నించాలి. ఈ నేపథ్యంలోనే ఐసీసీ వాటిపై దృష్టిసారించాలి’ అని మోర్గాన్‌ పేర్కొన్నాడు. అయితే ఏప్రిల్ 9 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ మెగాటోర్నీకి తెరలేవనుండగా.. కేకేఆర్ ఏప్రిల్ 11న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మొదటి మ్యాచ్ ఆడనుంది.

Related posts