telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎయిర్ ఇండియా రూ. 58 వేల కోట్ల అప్పుల్లో ఉంది: నిర్మలా సీతారామన్

Nirmala seetharaman

ఎయిర్ ఇండియా ప్రస్తుతం రూ. 58 వేల కోట్ల అప్పుల్లో ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలను వచ్చే సంవత్సరం మార్చిలోగా విక్రయిస్తామనివ్యాఖ్యానించారు. “రెండు కంపెనీల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి చేయాలని భావిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అనుసరించి తుది నిర్ణయం ఉంటుంది” అని ఓ ఆంగ్పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నిర్మల వ్యాఖ్యానించారు.

ఎయిర్ ఇండియా సంస్థ చైర్మన్ అశ్వని లోహానీ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ వాటాల ఉపసంహరణ తరువాత సంస్థ నిలదొక్కుకుంటుందన్న భరోసాను ఇచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్, ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిని చూపుతున్నారని అన్నారు. ఇటీవల నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎయిర్ ఇండియా సహా, పలు కంపెనీల్లో డిజిన్వెస్ట్ మెంట్ కు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపిన విషయం విదితమే. ఆసక్తిగల సంస్థల నుంచి లేఖలను కోరుతూ ఓ ప్రకటన కూడా విడుదలైంది. ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related posts