telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు!

karona

ఏపీలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. కోవిడ్-19 బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. నిన్న రాత్రి 10.30 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల మధ్య కొత్తగా 16 కేసులు నమోదయి ఆ సమయానికి మొత్తం కేసులు 180కి చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 నుంచి శనివారం సాయంత్రానికి ఏపీలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

కృష్ణా జిల్లాలో కొత్తగా 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190 కి పెరిగిందని ప్రభుత్వం వివరించింది. కృష్ణా, నెల్లూరులో అత్యధికంగా 32 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Related posts