telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ నిర్ణయాన్ని ప్రశంసించిన శివసేన

Rahul gandhi congress

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో శివసేన పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించింది. దేశాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న తరుణంలో రాహుల్ సిసలైన ప్రతిపక్ష నేతలా హుందాగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఆయనలో రాజకీయ పరిణతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని శివసేన పేర్కొంది. విపత్తు వేళ ఓ విపక్షం ఎలా వ్యవహరించాలో ఆయన తన వైఖరితో చాటిచెప్పారని తెలిపింది.

ప్రజాప్రయోజనాలకే పెద్దపీట వేసి అందుకు అనుగుణంగా నడుచుకుంటున్నారని కొనియాడింది. ఈ మేరకు పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో ప్రస్తావించింది. రాజకీయాలకు ఇది తరుణం కాదని, అందరూ ఐక్యంగా పోరాడాలని రాహుల్ పిలుపునిచ్చారు. రాహుల్ పైనా, మోదీ, అమిత్ షాలపైనా భిన్న వాదనలు ఉన్నాయి. అయితే, బీజేపీ సక్సెస్ లో సగభాగం రాహుల్ గాంధీ ఇమేజిని దెబ్బతీసే క్రమంలోనే సాధ్యమైంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది కానీ రాహుల్ మాత్రం క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నాడని శివసేన పేర్కొంది.

Related posts