telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

సినిమా రేంజ్ లో యువతి దొంగతనం… 40 నిమిషాల పోలీస్ ఛేజింగ్

Woman

లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాకు చెందిన ఓ యువతి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేసిన సాహసానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగతనం కేసులో నిందితురాలైన అమేలియా మన్జానో (21) అనే యువతి లాస్ ఏంజిల్స్ వీధుల్లో పోలీసులకు పరుగులు పెట్టించింది. అప్పటికే వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న అమేలియా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పోలీసుల కంటబడింది. దాంతో పోలీసులు ఆమెను వెంబడించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆమె కారు నుంచి దిగి పరిగెత్తడం మొదలెట్టింది. దాంతో పోలీసులు కూడా ఆమె వెనకాలే పరిగెత్తారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆమె సినిమాటిక్ స్టైల్‌లో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి దూకుతూ వారికి ముచ్చెమటలు పట్టించింది. ఈ క్రమంలో ఆమె ఒక ఇంటిపై కప్పు నుంచి కారుపై దూకడం కూడా వీడియోలో ఉంది. ఇలా 40 నిమిషాల పాటు ఈ చేజింగ్ కొనసాగింది. ఎలాగోలా అమేలియాను బ్లాక్ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరకు తనతో పాటు కారులో వచ్చిన ఎడ్గార్ అకోస్టా (23) అనే యువకుడ్ని కౌగిలించుకుని పోలీసులకు లొంగిపోయిందామె. దాంతో అమేలియాను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

Related posts