telugu navyamedia
క్రీడలు వార్తలు

సచిన్ 100 కు 9 ఏళ్ళు..

భారత క్రికెట్ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ఎప్పుడు గుర్తు పెట్టుకునే క్రికెటర్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్. అయితే తన కెరీర్‌లో ఎన్ని అద్భుతమైన రికార్డులు సాధించిన ఆ అత్యంత ముఖ్యమైన రికార్డుకు సాధించి నేటికి 9 ఏళ్లు పూర్త‌వుతోంది. 2012లో ఇదే రోజున సచిన్.. తన 100వ సెంచరీ సాధించాడు. సెంచరీ సెంచరీలు చేసి క్రికెట్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కానీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ ‌పై 114 పరుగులు చేసిన ఈ ఘనతను అందుకున్నాడు. అందుకే మార్చి 16.. భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే రోజు. ఆసియా కప్-2012లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన వన్డే మ్యాచ్​లో సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ సెంచరీ సచిన్​కు వన్డేల్లో 49వది. అలాగే అప్పటికే టెస్టుల్లో 51 సెంచరీలు చేయడం వల్ల ప్రపంచ క్రికెట్​లో 100 శతకాలు బాదిన ఏకైక ఆటగాడిగా మాస్టర్ చరిత్ర సృష్టించాడు. సచిన్ కెరీర్​లో మొత్తం 164 అర్ధసెంచరీలు ఉన్నాయి. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీల జాబితాలో 71 శతకాలతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో నిలవగా.. కోహ్లీ 70 సెంచరీలతో ఉన్నాడు.

Related posts