telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పలు కోర్సుల్లో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

Class room

గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు నిర్మాణరంగంలో పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. 18 నుంచి 35 ఏండ్లలోపు వయసున్న నిరుద్యోగ యువతకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌( న్యాక్‌) డైరెక్టర్‌ ఐ శాంతిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకొన్నవారికి న్యాక్‌ సర్టిఫికెట్‌తోపాటు ప్రైవేట్‌రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

10వ తరగతి ఫెయిల్‌/పాస్‌ అర్హతతో ఎలక్ట్రికల్‌ హౌజ్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌ అండ్‌ శానిటేషన్‌, డ్రైవాల్‌ అండ్‌ ఫాల్‌ సీలింగ్‌, పెయింటింగ్‌ అండ్‌ డెకరేషన్‌, వెల్డింగ్‌, ల్యాండ్‌ సర్వేయర్‌, స్టోర్‌కీపర్‌ తదితర కోర్సుల్లో మూడునెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.అన్ని కోర్సుల్లో ఉచితంగా శిక్షణనిస్తామని తెలిపారు.

కోర్సు సమయంలో యూనిఫారం, పుస్తకాలు, బూట్లు, హెల్మెట్‌ ఉచితంగా అందజేయడంతోపాటు ఉచిత భోజన, వసతి అందిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, కుల ధ్రువీకరణపత్రాలతోపాటు విద్యార్హత సర్టిఫికెట్లు, బ్యాంక్‌ అకౌంట్‌, ఆరు పాస్‌పోర్ట్‌ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7989050888, 8328622455 నంబర్లలో సంప్రదించాలని డైరెక్టర్‌ శాంతిశ్రీ పేర్కొన్నారు.

Related posts