telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

మరో ఆసుపత్రికి రెఫర్ చేయండి.. డాక్టర్ సుధాకర్ విజ్ఞప్తి

Dr Sudhakar

విశాఖ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్ లేఖ రాశారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయినప్పటికీ తనకు మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని డాక్టర్ సుధాకర్ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చిందీ ఆ లేఖలో వివరంగా పేర్కొనడం గమనార్హం.

తనకు ఇస్తున్న మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సుధాకర్ వాపోయారు. పెదవిపై వచ్చిన మార్పులను చూపిస్తూ తీసిన ఫొటోను లేఖకు జతచేశారు. తనను వెంటనే మరో ఆసుపత్రికి రెఫర్ చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మాస్కుల వివాదం సహా అన్ని విషయాలను ఆ లేఖలో సవివరంగా రాసుకొచ్చారు.

Related posts