telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

తప్పు చేస్తే మాత్రం చర్యలు.. చైనాకు ట్రంప్ వార్నింగ్

trump usa

గత సంవత్సరం డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ 1.57 లక్షల మందికి పైగా ప్రజలు మరణించారు. చైనాపై చర్యల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.వైరస్ వ్యాప్తి వెనుక చైనా ప్రమేయం ఉన్నా, తెలిసీ ఆ దేశం తప్పు చేసిందని టెలినా అందుకు తగ్గ చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.

ఈ వైరస్ ప్రపంచానికి శోకాకుండా చైనాలోనే ఆపే అవకాశాలున్నా, ఆ దేశం అలా చేయలేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దాని ఫలితంగానే, ప్రపంచం ఇప్పుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని అన్నారు. వారు తెలిసి చేసుంటే తప్పకుండా చర్యలుంటాయన్నారు. ఒకవేళ చైనా తప్పు చేసున్నా, దాన్ని వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చేయలేదని, ముందే ప్రపంచాన్ని హెచ్చరించి వుండాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఈ మహమ్మారి చూపించే ప్రభావం గురించి చైనాకు ముందే తెలుసునని మిగతా ప్రపంచాన్ని ఆదిలోనే హెచ్చరిస్తే, తమ పరువు పోతుందని చైనా భావించివుండవచ్చని ట్రంప్ అన్నారు. కరోనా వైరస్ విషయంలో ఇప్పటికే చైనా తన విచారణ ప్రారంభించిందని, ఆ విచారణలో ఏం తేలుతుందో చూస్తామని అన్నారు.

Related posts