telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశాన్ని .. దట్టంగా కమ్మేస్తున్న మాంద్యం మేఘాలు..

recession very soon in india

ఈ సంవత్సరం ప్రారంభం నుండి వివిధ రంగాలకు సంబంధించి ఉత్పత్తి తగ్గటంపై వెల్లడౌతున్న అంశాలను జులై నెలకు విడుదల చేసిన అంకెలు దేశంలో ఆర్థిక మాంద్యాన్ని స్థిరపరిచాయి. అన్ని రంగాలలో అభివృద్ధి తగ్గింది. కార్ల పరిశ్రమ మాంద్యాన్ని ఎదుర్కొంటున్నది. ఈ రంగంలో నెలకొన్న పరిస్థితులు క్రమంగా అన్ని రంగాలలోకి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలోకి జారిపోతుంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి. అమెరికా కూడా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. యూరప్ లో ఎన్నో పేరెన్నిక గల సంస్థలు మూతబడ్డాయి. అయితే ఇండియా మాత్రం అప్పుడు కూడా ఠీవీగా కనిపించింది. భారత మార్కెట్లు ఉరకలెత్తాయి. దేశీయ పరిశ్రమ అప్పుడు దేశాన్ని నిలబెట్టింది. అమెరికా లాంటి దేశాలే ఇబ్బందులు పడినా ఇండియా మాత్రం అప్పుడు మాంద్యం ప్రభావానికి లోను కాలేదు!

మోడీ వచ్చినప్పటి పరిస్థితి చుస్తే, బంగ్లాదేశ్ ఆర్థిక ప్రగతి భారత దేశానికన్నా చాలా బాగుందని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి. ఇండియా కన్నా బంగ్లాదేశ్ ముందుకు దూసుకపోతోందని తేల్చాయి. తాజాగా హంగర్ ఇండెక్స్ లో ఇండియా కన్నా శ్రీలంక – పాకిస్తాన్ వంటి దేశాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఆ దేశాల్లో పిల్లలకు మనదేశంలో కన్నా మంచి ఆహారం అందుతూ ఉంది. వారిలో పెరుగుదల స్థాయి బాగుంది. ఆఖరికి టూరిజం మీద ఆధారపడి బతికే శ్రీలంక వంటి దేశం కూడా ఆర్థిక మాంద్యం ప్రభావంలోకి పడటం లేదు. మన దేశంలో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుతూ ఉంది. నోట్ల రద్దు అప్పుడు పడిపోయిన చిన్నాచితక పరిశ్రమలు మళ్లీ కోలుకోలేదని తెలుస్తోంది. మాంద్యం ప్రభావం సామాన్యులపై పూర్తి స్థాయిలో పడితే పరిస్థితులు తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. మాంద్యాన్ని నివారించాలన్నా, ప్రపంచాన్ని కమ్ముకుంటున్న సంక్షోభం నుండి మనం తక్కువ నష్టంతో బయట పడాలన్నా నయా ఉదారవాద సంస్కరణలను పక్కన పెట్టి, ప్రజలకు ఉపాధిని, ఉద్యోగాలను కల్పించే విధానాలను అమలు జరపాలి. అపుడు మాత్రమే మాంద్యాన్ని అధిగమించటంతో పాటు సంక్షోభం నుండి కూడా తక్కువ నష్టంతో బయటపడగలం అంటున్నారు నిపుణులు.

Related posts