telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దినపత్రికల విషయంలో “మహా”ప్రభుత్వం కీలక నిర్ణయం

News papers hindi

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం దినపత్రికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రింట్ మీడియాకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దినపత్రికలు, మ్యాగజైన్లను ఇంటింటికి వెళ్లి డోర్ డెలివరీ చేయడంపై మాత్రం నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది.

వివిధ శాఖల కమిషనరేట్ల కమిషనర్లు, డైరెక్టరేట్ల డైరెక్టర్లు తమ సిబ్బందిలో పది శాతం మందితో కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించింది.ఈ నెల 20 నుంచి హాట్‌స్పాట్ కాని ప్రాంతాల్లో అనుమతించే కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆరోగ్యం, వ్యవసాయం తదితరాలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి అమలు చేయాల్సిన సడలింపులకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Related posts