telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీకి వరుణుడి గండం…

ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ పోరులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు, కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కఠిన పరిస్థితులలో మ్యాచ్ చూద్దామని ఆశించిన అభిమానులకు ఓ చేదువార్త. సౌథాంప్టన్‌ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్ష గడం పొంచివుంది. రిజర్వు డేతో కలిపి మొత్తం ఆరు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఇంగ్లండ్ వాతావరణ శాఖ, అక్కడి వెబ్‌సైట్లు ఈ విషయాన్నే చెపుతున్నాయి. దాదాపు 80% వర్షం కురుస్తుందని వెల్లడించాయి. జూన్ 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్లో తలపడనున్నాయి. రెండూ అత్యుత్తమ జట్లే కావడంతో పోరు రసవత్తరంగా సాగుతుందని అందరూ భావిస్తున్నారు. రిజర్వు డే ఉందని సంతోషించినా.. ఇప్పుడు ఆట జరిగే అన్ని రోజులూ వర్షగండం ఉందని తెలియడంతో నిరాశకు గురవుతున్నారు.

Related posts