telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉచిత విద్యుత్‌ కు మంగళం పాడే ప్రక్రియ: దేవినేని ఉమ

devineni on power supply

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విమర్శానాస్త్రాలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ పథకానికి మంగళం పాడే ప్రక్రియను చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ట్విటర్ లో పోస్ట్ చేశారు.

రైతుల్లో మీటర్ భయం,అదనపు బిల్లులు రైతులే చెల్లించాలా? అని ప్రశించారు. నగదు బదిలీలో సర్కారును నమ్మలేం, జీవోలో స్పష్టతలేదని తేల్చిచెబుతున్న రైతు సంఘాలు. అప్పులకోసం మమ్మల్ని బలిచేస్తారా? ఉచిత విద్యుత్ కు మంగళం పాడినట్లేనంటున్న రైతులకు, రైతు సంఘాలకు సమాధానం చెప్పాలని ట్విట్టర్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related posts