telugu navyamedia
రాజకీయ వార్తలు

చొరబాటుదారులపై రాహుల్ ప్రేమ: అమిత్ షా ఫైర్

amith shah bjp

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. జార్ఖండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ చొరబాటుదారులపై రాహుల్ ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చొరబాటుదారులు ఎక్కడికి వెళ్తారు? ఏం తింటారు? అని రాహుల్ ప్రశ్నించడం దారుణమన్నారు. దేశమంతటా నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) ను అమలు చేస్తామని తెలిపారు. చొరబాట్లను అణచివేస్తామని అన్నారు. చొరబాటుదారులను గుర్తించి 2024 లోగా దేశం నుంచి వారిని బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు.

Related posts