బీజేపీ నేతల పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపణల పై కేటీఆర్ స్పందిస్తూ దమ్ముంటే అవినీతిపై ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు.
ఈ క్రమంలో విజయశాంతి స్పందిస్తూ కేటీఆర్ గారు, సవాల్ విసిరే ముందు మీ నాన్న కేసీఆర్ పర్మిషన్ తీసుకున్నారా?’ అని విజయశాంతి అన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కూడా కేటీఆర్ ఇదే మాదిరి సవాల్ విసిరారని ఎద్దేవా చేశారు. మరోవైపు, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశించిన సంగతి తెలిసిందే.