telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

విద్యార్థినిని వేధించిన యువకుడు.. దేహశుద్ది చేసిన విద్యార్థులు!

New couples attack SR Nagar

తెలంగాణలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని ఓ యువకుడు కాలేజీ ఆవరణలోనే వేధించగా, అక్కడే ఉన్న విద్యార్థులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తిమ్మాపూర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసేందుకు ఓ అమ్మాయి వచ్చింది.

అయితే అక్కడే ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న వెంకటేశ్, యువతిని వేధించడం ప్రారంభించాడు. దీంతో తిరగబడ్డ అమ్మాయి అతని కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు వెంకటేశ్ ను చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వెంకటేశ్, క్షమించాలని కోరుతూ యువతికి లేఖ రాసి ఇచ్చాడు.

Related posts