telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం..రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Badrachalam godavari

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ఉదయం ఆరు గంటల సమయానికి నీటిమట్టం 48.1 అడుగులకు చేరుకుంది. నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, నేడు నీటి మట్టం మరింత పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

వరదనీరు పోటెత్తుతుండడంతో లోతట్టు ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఎగువ ప్రాంతాలైన ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి వరద నీరు పోటెత్తుతుండడంతోనే భద్రాచలం వద్ద గోదావరికి భారీ స్థాయిలో నీరు వస్తోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. నీటి మట్టం మరో 5 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

Related posts