telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో పది పరీక్షల షెడ్యూల్ విడుదల

exam hall

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 8 నుంచి జూలై 5 వరకు మిగిలిన పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఒక్క బెంచ్‌పై ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చుంటారని మంత్రి పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నైట్లెతే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్ష రాయిస్తామని మంత్రి చెప్పారు.
జూన్ 8న ఇంగ్లీష్ పేపర్ 1, 11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2, 20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2, 26న సోషల్ పేపర్ 1, 29న సోషల్ పేపర్ 2 పరీక్షలను నిర్వహించనున్నారు.

కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలను చేపడుతున్నారు. విద్యార్థులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అన్నారు. అంతేకాకుండా క్లాసుకు 20 మంది విద్యార్థులను మాత్రమే ఉంటారు. ప్రతీ ఎగ్జామ్ సెంటర్ లోనూ హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు.

Related posts