దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పరీక్షల వాయిదాల పర్వం కొనసాగుతున్నది. కొన్ని రాష్ట్రాల్లో పది పరీక్షలు రద్దయ్యాయి. మరికొన్ని రాష్ట్రాల్లో పది పరీక్షలతో పాటు ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేశారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో డిగ్రీ పరీక్షలు సైతం రద్దయ్యాయి.
తాజాగా పశ్చిమబెంగాల్‌లో కూడా హయ్యర్ సెకండరీ పరీక్షలు రద్దయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో జూలై 2, 6, 8 తేదీల్లో జరుగాల్సిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పశ్చిబెంగాల్ విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతానికి రద్దయిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే వివరాలను తర్వాత వెల్లడిస్తామని పార్థ చటర్జి పేర్కొన్నారు.