telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేటీఆర్ ప్రశంసలపై ఈటల ట్వీట్!

Etala Rajender

తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. హైద్రాబాద్ నగరంలోని గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్ ను 20 రోజుల లోపే తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)గా మార్చినందుకు ప్రశంసించారు.  తక్కువ సమయంలోనే దీనిని 1500 పడకల ఆసుపత్రిగా మార్చారని, రాజేందర్, ఆయన బృందం కలిసి అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు.

కేటిఆర్ ప్రశంసలపై ఈటల రాజేందర్ స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, గైడ్ లైన్స్ వల్లనే ఆ పని పూర్తి చేశామని తెలిపారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అదే విధంగా కేటీఆర్ కూ, ఆరోగ్య శాఖ బృందానికి ఈట్ల కృతఙ్ఞతలు తెలిపారు.

Related posts